LatestNewsReviewTelugu

శ్రీనివాస్ రెడ్డి నటించిన ముగ్గురు మొనగాళ్ళు మూవీ రివ్యూ & రేటింగ్

ముగ్గురు మొనగాళ్ళు మూవీ రివ్యూ & రేటింగ్



నటీనటులు : శ్రీనివాసరెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు, రిత్విష్‌శర్మ, శ్వేతా వర్మ, నాజర్, రాజా రవీంద్ర
దర్శకుడు: అభిలాష్‌ రెడ్డి
నిర్మాతలు : పి. అచ్యుత్‌రామారావు
సంగీత దర్శకుడు : సురేష్‌ బొబ్బిలి
ఎడిటర్‌: బి. నాగేశ్వర రెడ్డి

‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్‌ రెడ్డి ఇప్పుడు తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాని నిర్మించారు. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్‌ రెడ్డి మెయిన్ లీడ్‌ రోల్‌ చేస్తుండగా,దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించారు.మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

సుశాంత్ (శ్రీనివాస్ రెడ్డి)కి వినపడదు, కిషోర్ (దీక్షిత్‌ శెట్టి) మాట్లాడలేడు, దీపక్ ( వెన్నెల రామారావు) కు కనపడదు. అయితే ఈ ముగ్గురికి అనుకోకుండా వరుస హత్యల జరుగుతున్న కేసులో క్లూ దొరుకుతుంది. లీడింగ్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులను ఎవరో అతి దారుణంగా చంపుతూ ఉంటారు. ఇంతకు వారిని చంపుతుంది ఎవరు ? ఈ హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది ? సుశాంత్ కి, కిషోర్ కి, దీపక్ కి ఈ హత్యల గురించి అసలు ఎలా తెలుసు ? ఈ మధ్యలో సుశాంత్ ప్రేమ కథ ఎలా సాగింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి.. అలాగే ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించిన దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ఎలాంటి గ్యాప్ లేకుండా తమ కామెడీ టైమింగ్ తో విషయం లేని సీన్స్ లో కూడా నవించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. కొన్ని చోట్ల బాగానే నవ్వించారు కూడా. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సీక్వెన్స్ మరియు దీక్షిత్ శెట్టి లవ్ సీన్స్ లో కొన్ని బాగున్నాయి. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన రాజా రవేంద్ర కూడా బాగా ఆకట్టుకున్నాడు.

ఇటు కథలో కామెడీతో కూడుకున్న సీరియస్ నెస్ కూడా తీసుకొచ్చారు. అలాగే వరుస హత్యల వెనుక డ్రామా కూడా బాగుంది. ఇక హీరోయిన్ నటించిన నటి కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించాం అనిపించున్నారు. ఇక దర్శకుడు సినిమాలో సస్పెన్స్ ను మెయింటైన్ చేసినా.. ఎక్కువుగా వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ:


ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి.. అలాగే ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించిన దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ఎలాంటి గ్యాప్ లేకుండా తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వులు పూయించారు. సాధారణ సీన్లను సైతం తన కామెడి టైమింగ్ తో వెన్నెల రామారావు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించాడు. అలానే శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి లవ్ సీన్స్ బాగున్నాయి. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన రాజా రవేంద్ర కూడా ఆకట్టుకున్నాడు. దర్శకుడు కథలో కామెడీతో కూడుకున్న సీరియస్ నెస్ ని బాగా నడిపించారు. వరుస హత్యల వెనుక అల్లుకున్న డ్రామా ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు సినిమాలో సస్పెన్స్ ను మెయింటైన్ చేయడంతో పాటు.. ఎక్కువగా వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశారు. దర్శకుడు మంచి ఐడియా తీసుకుని… దానికి సరైన స్క్రీన్ ప్లేను రాసుకొని మెప్పించారు. ప్రతి సీన్స్ ను ఆయన స్క్రీన్ మీద బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు సినిమాటోగ్రఫీ తోడు కావడంతో సినిమా గ్రాండియర్ గా స్క్రీన్ పై కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండు. సంగీతం సినిమాకి తగ్గట్టుగా ఉంది. చిత్ర నిర్మాత కథకు తగ్గట్లుగానే ఖర్చు పెట్టారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ గా వచ్చిన ఈ ‘ముగ్గురు మొనగాళ్లు’ కామెడీ సన్నివేశాలతో మెప్పించారు. .!
చివరగా : కామెడీ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ ఫన్ ని ఇస్తుంది. నచ్చుతుంది.

రేటింగ్: 3/5

Varun

Varun is a senior editor at Moviezupp, a popular entertainment website devoted to all things movies. He is an experienced reviewer, writer, and news reporter. Varun has been covering the Telugu cinema scene for several years, writing on everything froml film festivals to regional and national releases.